
సోషల్ మీడియాలో అందమైన ముఖంతో అందరినీ తన వైపు ఆకర్షించే ప్రియాంక సింగ్ అంటే తెలియని వారు లేరు. ఐతే బుల్లితెర మీద ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో అడపాదడపా కనిపిస్తోంది. ఐతే రీసెంట్‌గా ఆమె ఒక పోస్ట్‌ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అది కూడా కొంచెం బాధతో. ఇంతకు ఏం అన్నదంటే...
"ఈ సంవత్సరం నేను ఎన్నో విషయాలను జరుగుతాయని ఆశించాను కానీ అన్నీ నేను అనుకున్న విధంగా జరగలేదు. అయినప్పటికీ, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నా భావోద్వేగాలను, నాలో లోతుగా పాతుకుపోయిన నమ్మకాలను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటున్నాను. ఐనా కానీ నేను నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా కాలంతో పోరాడుతూ, మంచి రోజులు ముందున్నాయని నమ్మకంతో బతుకుతున్నది. ప్రతి తుఫానుకూ ఒక ముగింపు ఉంటుంది. అలాగే ఏదో ఒక రోజు నాకు మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆగస్టు నెలకు స్వాగతం. ఈ నెల శాంతిని, సంతోషాన్ని, స్వస్థతను, నేను ఎదురుచూస్తున్న ఎన్నో అందమైన ఆరంభాలను తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. అంతా సర్దుకుంటుందని ఆశిస్తూ " అంటూ ఒక నోట్ పెట్టింది ప్రియాంక సింగ్.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ "మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు ఆ ఈశ్వరుడు తప్పక ఇస్తాడు కానీ కొంత కాలం వేచి ఉండాలి కానీ అధైర్యపడకూడదు ఓకే ఎప్పుడు ఉత్తమంగా ఆలోచించండి... పింకీ మేడం బాధపడకండి అంతా మంచే జరుగుతుంది. ఆ చూపులో ఏదో బాధవీచిక. మీరు ఎందుకు బాధపడుతున్నారో తెలీదు కానీ మీ ఫ్యాన్‌గా చెప్తున్నా ధైర్యంగా ఉండండి. మేమంతా మీతో ఉన్నాం" అంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ రిప్లైస్ ఇస్తున్నారు.